womens unions protest: విజయవాడ లెనిన్ కూడలిలో మహిళా సంఘాల ఐక్యవేదిక నిరసనకు దిగింది. జంగారెడ్డిగూడెం కల్తీ సారా మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆందోళన చేపట్టింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, శాశ్వత గృహం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మహిళా నేతలు డిమాండ్ చేశారు.
వరుస మరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలిపారు. కల్తీ సారా విక్రయించిన వారిని శిక్షించాలన్నారు. సారా తాగి జనం చనిపోతే అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. ప్రజల దృష్టి మళ్లించడానికి పెగాసెస్ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు.
ఇదీ చదవండి: Jangareddygudem Issue: 'కల్తీసారా కాటే'.. తేల్చిచెప్పిన బాధిత కుటుంబ సభ్యులు