ETV Bharat / city

జాగ్రత్త.. నేడు, రేపు ఉష్ణోగ్రతల్లో మరింత పెరుగుదల!

రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, విదర్భ నుంచి వేడిగాలుల ప్రభావంతోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రెండు రోజుల్లో ఈ వేడి కొంతమేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.

author img

By

Published : Apr 4, 2021, 3:20 PM IST

high temperatures in state, two days temperatures increase in ap
రాష్ట్రంలో నేడు, రేపు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
high temperatures in state, two days temperatures increase in ap
నేడు, రేపు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల

కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. విజయవాడ, కడప, కర్నూలు, అమరావతిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అనంతరం ఎండ తీవ్రత తగ్గొచ్చని అభిప్రాయపడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, విదర్భ నుంచి వేడిగాలుల ప్రభావంతోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పారు. వేడిగాలులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

విజయవాడలో ఎప్పుడూ రద్దీగా ఉండే బందర్ రోడ్డు, బెంజ్ సర్కిల్ వద్ద ఎండ తీవ్రతకు వాహనాల ట్రాఫిక్ తగ్గింది. ఇంటి నుంచి బయటకు రావాలంటే నగరవాసులు భయపడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉదయం 11 గంటలు దాటిన అనంతరం ఎండ తీవ్రత తగ్గే వరకు ఇంటి నుంచి బయటకు రావాద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎక్కువ మోతాదులో మంచినీరు దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎండ వేడిమి శరీరంపై పడకుండా జాగ్రత్త పడాలని చెప్పారు.

ఇదీ చదవండి:

తహసీల్దార్‌ నిర్వాకం.. ప్రభుత్వ భూములకు జిరాయితీ పట్టాలు.. వంద ఎకరాలు స్వాహా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.