జగన్ కంపెనీల్లో పెట్టుబడులను తప్పుబడుతున్న సీబీఐ.. అందులో వచ్చిన లాభాల గురించి, తాను కట్టిన పన్నుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని నిమ్మగడ్డ ప్రసాద్ మంగళవారం తెలంగాణ హైకోర్టు(Jagan piracy case hearing in Telangana High Court )కు నివేదించారు. ప్రస్తుతం పెట్టుబడుల విలువ పెరిగిందని... డివిడెండ్లు అందుతున్నాయన్నారు. పెట్టుబడులు పెట్టడమే నేరంగా చూపుతున్నారన్నారని ధర్మాసనానికి తెలిపారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై కేసు కొట్టి చేయాలని కోరుతూ వాన్ పిక్ ప్రాజెక్ట్, నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
క్విడ్ ప్రో పద్ధతిన పెట్టుబడులు పెట్టామని సీబీఐ ఆరోపిస్తోందని.. అప్పటి సీఎం వైఎస్ఆర్ మరణించిన తరువాత కూడా పెట్టుబడులు పెట్టినట్లు నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. జగతిలో 497 కోట్లు మాత్రమే పెట్టామని.. సీబీఐ చెబుతున్నట్లు 854 కోట్లు పెట్టలేదన్నారు. 80 శాతం పెట్టుబడులు వాన్ పిక్ ప్రాజెక్టు మంజూరు కాకముందే పెట్టామని.. నష్టాల్లో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి లాభాల్లోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. సీబీఐ కేసు వల్ల అంతర్జాతీయంగా వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోలేకపోతున్నామన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం నేటికి వాయిదా(Jagan case at ts high court) వేసింది.
ఇదీ చదవండి..
KONDAPALLI: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిందే:హైకోర్టు