రాష్ట్రంలోని పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీచేస్తూ..పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి పోస్టింగ్ కల్పిస్తూ శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డా.కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టు, పులిచింతలలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్న వి.డేవిడ్‌రాజు పశ్చిమగోదావరి జిల్లా రెవిన్యూ అధికారిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఏవోగా పనిచేస్తోన్న బి. శ్రీనివాసరావు పశ్చిమగోదావరి జిల్లా ఆసరా, సంక్షేమం జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆ పోస్టులో గతంలో నియమితులైన ఏవీ రాంప్రసాద్ నియామకాన్ని ప్రభుత్వం రద్దుచేసింది. ఆయన్ని తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సూచించింది.
కేఆర్‌పురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా వినాయకం నియమితులయ్యారు. ఏపీ సీఆర్‌డీఏ, విజయవాడలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న కె.లలిత పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. జి కేశవనాయుడు అనంతపురం ఏఎన్‌ఎస్‌ఈటీ సీఈవోగా నియమితులయ్యారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టులో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న డి.తిప్పేనాయక్ ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ అయ్యారు. జీఎన్‌ఎస్‌ఎస్ కడప ప్రత్యేక కలెక్టర్‌కు పీఏగా పనిచేస్తున్న సుజన ఐసీడీఎస్ అనంతపురం పీడీగా బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుకు ఓఎస్‌డీగా పనిచేస్తున్న కె.రఘునాథరెడ్డి వీఎంఆర్‌డీఏ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
ఇదీచదవండి