ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

.

ప్రధాన వార్తలు @ 9pm
ప్రధాన వార్తలు @ 9pm
author img

By

Published : Sep 9, 2021, 8:59 PM IST

  • అనుమతి లేదని..అడుగడుగునా అడ్డుకుని..
    తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(nara lokesh) నరసరావుపేట పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విజయవాడ విమానాశ్రయం చేరుకోగానే లోకేశ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పర్యటనను అడ్డుకున్నారు. చివరికి ట్రాఫిక్‌, కొవిడ్‌ నిబంధనలు ఉల్లఘించారంటూ.. 41ఏ సీఆర్‌పీసీ(crpf) కింద నోటీసులు జారీ చేసి ఉండవల్లిలోని తన ఇంటికి తరలించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే'
    శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికే ‌అనూష హత్య జరిగిన ఏడు నెలల తర్వాత లోకేశ్‌ పరామర్శ యాత్ర పెట్టుకున్నారని హోం మంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ యాప్‌ వల్ల ఆపదలో ఉన్న ఒకరిద్దరు మహిళలకు మేలు జరిగినా..పూర్తిస్థాయి భద్రత కల్పించే యాప్‌గా గుర్తించవచ్చన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'వ్యవసాయం చేసేవాళ్లకు కచ్చితంగా రుణాలివ్వాలి'
    ఇళ్లపట్టాలు ఇచ్చిన పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు 35 వేలు చొప్పున రుణాలు ఇవ్వాలని సీఎం జగన్‌ బ్యాంకర్లను ఆదేశించారు. 3 శాతం వడ్డీకి రుణాలిస్తే.. మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని బ్యాంకర్లకు హామీ ఇచ్చారు. కౌలు రైతులందరికీ తప్పనిసరిగా పంట రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
    కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ బోర్డు ఛైర్మన్‌కు పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విషయంలో లేఖ రాశారు. ఏపీ 34 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా చూడాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భారత్​ అధ్యక్షతన 13వ బ్రిక్స్​ సదస్సు
    బ్రిక్స్​ దేశాల 13వ శిఖరాగ్ర సమావేశం గురువారం భారత్​ అధ్యక్షతన జరిగింది. భేటీలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో బ్రిక్స్​ సాధించిన ఘనతల పట్ల గర్వపడుతున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సుప్రీం కీలక వ్యాఖ్యలు
    నీట్ పరీక్ష(Neet Exam)​ అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని మార్చుకునేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు(Supreme Court On Neet) కొట్టివేసింది. ప్రస్తుతం కరోనా ఆంక్షలు సడలించినందున.. అభ్యర్థులు ఎక్కడికంటే అక్కడికి వెళ్లగలరని పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఇక అఫ్గాన్​ పునర్నిర్మాణమే'
    అఫ్గాన్ తాలిబన్​ ప్రభుత్వంలో(Taliban Government) ఆపద్ధర్మ ప్రధానిగా(Afghanistan Prime Minister) నియమితులైన మహమ్మద్​ హసన్ అఖుంద్​.. కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో పని చేసిన అధికారులు అఫ్గాన్​కు తిరిగి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నిర్ణయాత్మక పోరులో గెలిచేది ఎవరు?
    భారత్, ఇంగ్లాండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. చివరి టెస్టులో తాడోపేడో తేల్చుకోవాలని తహతహలాడుతున్నాయి. ఆఖరి మ్యాచ్​లో గెలుపొంది సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని రూట్​సేన(England Cricket News) భావిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.