- విషజ్వరాల పంజా.. ఆందోళనలో ప్రజలు..
కృష్ణా జిల్లాలో విష జ్వరాల బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌తో పాటు తాజాగా స్క్రబ్ టైఫస్ జ్వరాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- REGISTRATIONS: ఏ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ ఆ గ్రామాల సచివాలయాల్లోనే..
ఆస్తుల రిజస్ట్రేషన్లను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన విధానం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆస్తుల రిజస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. నకిలీ చలాన్లతో అక్రమాలు.. ఒకే ఆస్తికి డబుల్ రిజిస్ట్రేషన్లు వంటి వివాదాలు తలెత్తుతున్న పరిస్థితుల్లో.. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఒకింత కష్టతరమనే అభిప్రాయం వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎండిపోతున్న వేరుశనగ పంట.. కన్నీరు పెడుతున్న అనంత రైతు
అతివృష్టి, అనావృష్టి ఏదైనా అనంత రైతులకు కష్టాలు తప్పేలా లేవు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా ఉన్న కరవు సీమలో.. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో పులకరించిన అన్నదాతల ఆశలు... అంతలోనే ఆవిరవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం'
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోవడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ నటి కంగన రనౌత్(Kangana Samantha). వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఓ బీటౌన్ స్టార్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు.. విచారణ తర్వాత కోర్టుకు..
ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడ్డవారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సైతం ఉన్నాడు. ఈ విషయాన్ని ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. ఆర్యన్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు.. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీ ఆధిక్యంలో మమత- విజయం నల్లేరుపై నడకే!
భవానీపుర్ ఉపఎన్నిక(Bhabanipur by-election) కౌంటింగ్‌లో భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee ). ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి దీదీ.. 23,957 ఓట్ల ముందంజలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కూతురి వైద్యం కోసం మరో బిడ్డను అమ్మేసిన తల్లి!
అఫ్గాన్‌లో తాలిబన్లు(Afghanistan Taliban) అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత వివిధ ప్రాంతాల నుంచి కాబుల్‌కు చేరుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబుల్‌లోని శిబిరాల కింద నివసిస్తున్న ఓ మహిళ తన కుమార్తె వైద్య చికిత్స కోసం.. ఏడాదిన్నర శిశువును అమ్మేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Stock market: ఆర్బీఐ అంచనాలు, అంతర్జాతీయ పరిణామాలే కీలకం!
ఈ వారం స్టాక్ మార్కెట్లకు (Stock market) ఆర్బీఐ సమీక్ష అంచనాలు, అంతర్జాతీయ పరిణామాలు (Market Outlook) దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత వారం వరుస నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు.. ఈ సారి తేరుకుంటాయా? నిపుణులు ఏమంటున్నారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IPL 2021: 'అతడిని చూసి భయపడ్డాం'
చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings rajasthan royals match) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆటతీరు చూసి భయపడినట్లు చెప్పాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. శనివారం(సెప్టెంబరు 2) రాత్రి జరిగిన మ్యాచ్‌లో అతడు అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ హిట్ రీమేక్‌లో పవన్‌కల్యాణ్-చరణ్!
పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్(ramcharan pawankalyan) కలిసి నటించనున్నారంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. మలయాళ హిట్ 'డ్రైవింగ్ లైసెన్స్'లో(driving license telugu remake) వీరిద్దరూ సందడి చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.