ETV Bharat / city

Jawad Cyclone : తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన జవాద్ తుపాను

Jawad Cyclone Updates: బంగాళాఖాతంలో దిశమార్చుకున్న 'జవాద్'​ తుపాను ప్రస్తుతం మందగమనంతో ఒడిశా తీరంవైపు సాగుతోందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన జవాద్ తుపాను.. విశాఖకు ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది.

jawad cyclone updates today
ఒడిశా తీరంవైపు మెల్లగా కదులుతున్న జవాద్​ తుపాను
author img

By

Published : Dec 4, 2021, 6:25 PM IST

Updated : Dec 4, 2021, 8:39 PM IST

Jawad Cyclone Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో జవాద్ తుపాను కొనసాగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం దిశమార్చుకున్న తుపాను.. ప్రస్తుతం మందగమనంతో ఒడిశా తీరంవైపు సాగుతోంది. గడచిన 6 గంటలుగా ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన జవాద్ తుపాను.. విశాఖకు ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించింది.

Jawad Cyclone Moving towards puri coast in odisha: విశాఖకు ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం.. రేపు ఉదయం ఒడిశా తీరానికి దగ్గరగా చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత మరింతగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ వైపుగా కదిలే సూచనలు ఉన్నట్టు అంచనా వేసింది.

ఈ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర తీరప్రాంతాల్లో గంటకు 65-75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలాగే.. రాగల 24 గంటల్లో మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.

ఇదీ చవదవండి..

JAWAD CYCLONE EFFECT IN AP: తీవ్ర తుపానుగా జవాద్... రేపు తీరం దాటే అవకాశం

Last Updated : Dec 4, 2021, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.