ETV Bharat / city

నేడు తెదేపా ఆవిర్భావ దినోత్సవం.. ఇళ్లలోనే వేడుకలు - నేడు తెదేపా 38వ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ నేటితో 37 ఏళ్లు పూర్తిచేసుకొని 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించినందున ఈసారి నేతలంతా ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఇళ్లపై తెలుగుదేశం జెండాలు ఎగరేసి ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించాలని అధినేత చంద్రబాబు సూచించారు.

నేడు తెదేపా 38వ ఆవిర్భావ దినోత్సవం
నేడు తెదేపా 38వ ఆవిర్భావ దినోత్సవం
author img

By

Published : Mar 29, 2020, 5:22 AM IST

సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు... అన్న నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ.... నేటితో 37 ఏళ్లు పూర్తిచేసుకొని..38వ వసంతంలోకి అడుగుపెట్టింది. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు 1982 మార్చి 29వ తేదీన పార్టీని స్థాపించారు. ఈ సుదీర్ఘ కాలంలో ఎన్నో చారిత్రక ఘట్టాలు, సవాళ్లూ, సంక్షోభాలనూ పార్టీ చవిచూసింది.

కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించినందున ఈసారి నేతలంతా ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఇళ్లపై తెలుగుదేశం జెండాలు ఎగరేసి ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించాలని అధినేత చంద్రబాబు సూచించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.

తెలుగుదేశం రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత ఉన్న పార్టీ అన్న చంద్రబాబు...విద్యాధికులను రాజకీయాల్లోకి తీసుకురావటంతోపాటు..బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో వివిధ పార్టీల మధ్య, ఆయా ప్రభుత్వాల మధ్య...తెలుగుదేశానికి ముందు, తెలుగుదేశం తర్వాత అనే సరికొత్త యుగాన్ని ఆరంభించిందని గుర్తుచేశారు. అన్నివర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు. ఎన్టీఆర్ చూపిన బాటలో ఆయన ఆశయాల సాధన కోసం ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఇదీచదవండి

రాష్ట్రానికి వస్తున్న వారికి సరిహద్దుల్లోనే వసతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.