నందమూరి తారకరామారావు (NTR) 98వ జన్మదినం సందర్భంగా ఓ అరుదైన ఫోటోను తెలుగుదేశం పార్టీ (TDP) విడుదల చేసింది. ఎన్టీఆర్ వెండితర రారాజుగా వెలుగొందుతున్న రోజుల్లో తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లిన భక్తులు నేరుగా మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ను కలిశాకే తమ స్వగ్రామాలకు వెళ్లేవారని పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు.
జోరు వర్షంలోనూ..
అప్పటి మద్రాసు నగరంలోని బజుల్లా రోడ్డులో ఉన్న ఎన్టీ రామారావు(NT Rama Rao) ఇంటి ముందు ఉదయం టూరిస్టు బస్సులు కనిపించేవని.. జోరు వర్షం కురుస్తున్నా తమ అభిమాన నటుడ్ని చూసేందుకు ఆయన ఇంటిముందు కాచుకునేవారని వివరించారు. ఆనాటి మధుర స్మృతులను నేతలు స్మరించుకుంటున్నారు.
రెండో తిరుపతిగా..
ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య వచ్చిన యాత్రికులను ఎన్టీఆర్ ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసేవారని నేతలు పేర్కొన్నారు. మద్రాసులోని నాటి ఎన్టీఆర్ నివాసం రెండో తిరుపతిగా ప్రాచుర్యం పొందిందని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు.
ఇవీ చూడండి : CM Jagan Review: 'ఫౌండేషనల్ స్కూళ్ల తర్వాత డిజిటల్ బోధనపై దృష్టి పెట్టాలి'