![tnsf state president pranav gopal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11348800_tdp-1.jpg)
నాడు - నేడు పేరిట వైకాపా నాయకులు కమీషన్లు దండుకుంటున్నారని.. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. ఈ విషయంపై మంత్రి ఆదిమూలపు సురేష్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
"స్కూల్ బ్యాగులు, యూనిఫామ్ లలో వైకాపా నేతలు కమీషన్లు వసూళ్లు చేస్తున్నారు. రెండేళ్ల నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసి మభ్యపెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు సైతం సరిగా ఇవ్వటం లేదు. ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇస్తామని మాటతప్పారు. మంత్రితో సంబంధం లేకుండా విద్యాశాఖలో ఎప్పుడు ఏ ఉత్తర్వులు వెలువడుతాయో తెలియని పరిస్థితి నెలకొంది" - ప్రణవ్ గోపాల్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: