రేషన్ ఇచ్చిన 1.47కోట్ల మందికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కోరారు. జిల్లా ఇన్చార్జీ మంత్రులు అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వం శాస్త్రీయంగా ఆలోచన చేసి ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో రేషన్ కార్డు లేనివారు 20లక్షల మంది ఉన్నారని... వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్రానికి తక్షణం 10లక్షల కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనాను శాస్త్రీయంగా ఎదుర్కొనేందుకు వైద్యరంగాన్ని పరిపుష్టం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చూడండి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్'