ETV Bharat / city

విధేయతకు మంత్రివర్గంలో అవకాశం

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లు, విధేయులకు అవకాశమిచ్చారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గంలో చోటు దక్కింది.

జగన్మోహన్​రెడ్డి మంత్రివర్గం
author img

By

Published : Jun 8, 2019, 6:35 AM IST

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే కొడాలి నాని‍‌కి మంత్రివర్గంలోచోటు లభించింది. తొలినుంచీ తనకు అండగా ఉంటూ... పార్టీకి అందించిన సేవలను గుర్తించిన జగన్... నానికి మంత్రి పదవిని కట్టబెట్టారు. 2012లో వైకాపాలో చేరిన నాని... అప్పటి నుంచీ జగన్​తో నడిచారు. 2004లో తొలిసారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014లోనూ విజయం సాధించారు. మొత్తం నాలుగుసార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ గెలుపొందిన కొడాలి నాని... మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.

కొడాలి నాని
నియోజకవర్గం: గుడివాడ
వయస్సు: 47
విద్యార్హత: పదో తరగతి
రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

జిల్లా కేంద్రం మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొందిన పేర్ని నానికి జగన్ సైన్యంలో చోటు దక్కింది. అందరికీ అందుబాటులో ఉంటారనే పేరు సంపాదించుకున్న పేర్ని నాని... 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2019లోనూ విజయం సాధించారు. తొలి నుంచీ తన కుటుంబానికి అండగా ఉన్న... పేర్నినానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

పేర్ని వెంకట్రామయ్య (నాని)
నియోజకవర్గం: మచిలీపట్నం
వయస్సు: 49
విద్యార్హత: బీకాం
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెల్లంప్లలి శ్రీనివాస్​ను అమాత్య పదవి వరించింది. 2009లో తొలిసారి విజయవాడ పశ్చిమం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత వైకాపాలో చేరారు. 2019లో మరోసారి ఇదే నియోజకవర్గం పోటీచేసి గెలిచారు. జగన్ కేబినెట్​లో సభ్యుడయ్యారు.

వెల్లంపల్లి శ్రీనివాస్‌
నియోజకవర్గం: విజయవాడ (పశ్చిమ)
వయస్సు: 48
విద్యార్హత: పదో తరగతి
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం. ప్రజారాజ్యం, కాంగ్రెస్‌, భాజపాలో పనిచేశారు.

New Delhi, Jun 07 (ANI): While speaking to ANI, Sri Lankan High Commissioner to India, Austin Fernando said, "Prime Minister Modi is visiting Sri Lanka on June 09. India is the closest ally of Sri Lanka and therefore, head of the government visiting Sri Lanka is a proud moment". He added, "His visit to Sri Lanka after the April 21 bombings sends a message internationally. Domestically, when we look at it, it gives a message that here is a head of a government who is visiting to show solidarity".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.