ETV Bharat / city

దుర్గమ్మ వెండి రథంలోని మూడు సింహాలు ఎవరు తీసుకెళ్లినట్టు? - దుర్గ గుడిలో మూడు సింహాలు మాయం వార్తలు

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని నాలుగు సింహాల్లో.. మూడు సింహాలు మాయం కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. రథాన్ని పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి... శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తిన విపక్షాలు, ధార్మిక సంస్థలు... ఈ దుర్ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

దుర్గా గుడిలో ముసుగేసిన మూడు సింహాలు ఎవరు తీసుకెళ్లినట్టు?

author img

By

Published : Sep 16, 2020, 4:28 PM IST

Updated : Sep 16, 2020, 5:20 PM IST

అంతర్వేదిలో రథం దహనం సంగతి తేలనే లేదు... మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆ దుర్ఘటన దృష్ట్యా చేపట్టిన ముందస్తు చర్యలు... విజయవాడ దుర్గగుడిలో అమ్మవారి రథం సింహాలు మాయమైనట్టు బహిర్గతమైంది. అమ్మవారి రథంలోని సింహాల అదృశ్యంపై ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు రోజుల్లో వాస్తవాలు బహిరంగపరచాలని రాజకీయపక్షాలు, హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తుంటే... ఇది ముమ్మాటికీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పనిగా ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది.

ముసుగేసే ఉంచారు

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన వెండి రథానికి ముందు, వెనక భాగాన అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యం కావడం కలకలం రేపింది. గతేడాది ఉగాది రోజున స్వామివార్ల ఉత్సవమూర్తులను ఈ వెండి రథంపై ఊరేగించారు. ఈ ఏడాది కొవిడ్‌ దృష్ట్యా దేవస్థానం ఊరేగింపు రద్దు చేసింది. అప్పటి నుంచి ఆ రథానికి ముసుగేసి ఉంచారు. అంతర్వేది ఘటన తర్వాత రథాల పరిశీలన, భద్రత అంశాలపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులతో ఈనెల 13న పశ్చిమ ఏసీపీ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో వెండి రథాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు.

ఎక్కడ ఉన్నాయి?

అప్పుడే రథంపై సింహాల ప్రతిమల్లో మూడు ఆదృశ్యమైన సంగతి వెలుగు చూసింది. మంగళవారం సాయంత్రం నుంచి ఈ సంఘటనపై మీడియాలో కథనాలు రావడం మొదలైంది. ఇదే అంశంపై అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సురేశ్​బాబు మీడియాకు వివరణ ఇచ్చారు. గత 18 నెలలుగా వెండి రథం మల్లికార్జున మహామండపంలోనే ఉందని... ఎన్ని సింహాలు ఉన్నాయో? వాటిని మరమ్మతులకు ఇచ్చారా? లాకరులో ఉన్నాయా? అనేది పరిశీలిస్తామన్నారు. అప్పుడుగాని స్పష్టత రాదని తెలిపారు. దేవస్థానంలోని వెండి, బంగారు వస్తువులు, వాహనాలకు బీమా సౌకర్యం ఉందని... పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు.

శాఖాపరమైన విచారణ

ఉత్సవ రథంపై ఉండే సింహాలు మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆలయాన్ని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. దేవదాయశాఖ కమిషనర్‌ అర్జునరావు, పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ అధికారులతో కలిసి రథాన్ని పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని ఆల‌యాల్లో ర‌థాల ప‌రిర‌క్షణ‌కు చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ఈ క్రమంలోనే కనకదుర్గమ్మ వెండిర‌థంపై మూడు సింహాలు క‌నిపించ‌డం లేద‌ని తేలిందని వివరించారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రథాన్ని ఉపయోగించడం లేదని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేటతెల్లమవుతుందని అభిప్రాయపడ్డారు. ఘటనపై దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని... క‌మిటీ విచార‌ణ చేసి నిజాలు నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. చాలా ఆల‌యాల్లో భ‌ద్రత‌ను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయ‌ని... సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతా లోపం అని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆలయాల ఘటనల విషయంలో 50 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు.

భాజపా నేతల పరిశీలన

అమ్మవారి వెండి రథాన్ని భాజపా నేతల నేతల బృందం పరిశీలించింది. రథం ఖరీదు సుమారు 15లక్షల రూపాయల వరకు ఉంటుందని- ఆలయ ఈవో చెప్పారని... నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే ఉండటాన్ని తాము ప్రత్యక్షంగా గమనించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రతిమలు లాకర్​లో ఉన్నాయని చెప్పేందుకు ఈవో ప్రయత్నించారని... కానీ పరిస్థితిని చూస్తే వాటిని ధ్వంసం చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఘటనకు సంబంధించి రెండు రోజుల్లో నివేదికను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

సీబీఐ విచారణ చేపట్టాలి: తెదేపా

ఆలయంలోని వెండి రథాన్ని తెదేపా ప్రతినిధుల బృందం పరిశీలించింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, పి.అశోక్‌బాబు, మాజీ జడ్పీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ బృందంలో ఉన్నారు. రథంపై ఒక్క సింహం ప్రతిమ ఉండి- మిగిలిన మూడింటిన బలవంతంగా ఊడదీసినట్టు ఉఁదని వీళ్లు తెలిపారు. ఈ ఘటనలో మంత్రి వెల్లంపల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించిన ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలన్నారు. సీఎం స్పందించి సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.

ఈ ఘటనపై అఖిల భారత హిందూ మహాసభ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందాలు ఆలయాన్ని సందర్శించాయి. అంతర్వేది రథ ఘటనలో ఆలయ ఈవోపై వెంటనే చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. దుర్గగుడి ఈవో విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించాయి.

సగం వేలాడుతున్న నాలుగో సింహం

రథాలకు ప్రత్యేక షెడ్లను నిర్మించి పటిష్ఠ భద్రత కల్పించాలని.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు ఇటీవల విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ సూచించారు. ఆ తర్వాత... ఈవో, సిబ్బంది దుర్గమ్మ రథాలు పరిశీలించిన సమయంలో ఈ విషయం బయటపడింది. రథానికి నాలుగువైపులా ఉండాల్సిన వెండి సింహాల్లో 3 అపహరణకు గురికాగా... నాలుగో సింహాన్ని ఎత్తుకెళ్లేందుకు విఫలయత్నం చేసినట్లు అక్కడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆ సింహాన్ని బలంగా లాగడానికి ప్రయత్నించడంతో సగం వేలాడుతోంది. వెండి ఉత్సవ రథం, మరో చిన్న రథం దుర్గగుడి ఆవరణలో.. సమాచార కేంద్రానికి సమీపంలోనే ఉంటాయి. ఇక్కడ సిబ్బంది పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినప్పటికీ.. సింహాలు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది.

ఆ రథంపైనే.. అమ్మవారి ఊరేగింపు

దుర్గగుడిలో ఉగాదితోపాటు బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వెండి రథంపై దుర్గమ్మను ఊరేగిస్తారు. చైత్ర మాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఐదు రోజులపాటు రోజుకో వాహనంపై అమ్మవారు ఊరేగుతారు. ఐదో రోజున వెండి ఉత్సవ రథంపై అమ్మవారిని ఊరేగిస్తుండడం ఏళ్ల తరబడి వస్తోన్న ఆనవాయితీ.

ఇదీ చదవండి: దేవాదాయ శాఖ మంత్రిని, ఇంద్రకీలాద్రి ఈవోను తప్పించండి: చంద్రబాబు

Last Updated : Sep 16, 2020, 5:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.