రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు శాంతియుతంగా చేస్తున్న ఆందోళన శిబిరంపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. రాజధానిని తరలించొద్దని అమరావతి ప్రాంత ప్రజల చేస్తున్న ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియాపైనా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆక్షేపించారు. శాసన మండలిని రద్దు చేస్తామని బెదిరిస్తూ పదకొండు మంది ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు తెరలేపారని ఆరోపించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కాదు...జగ్లక్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఇదీచదవండి