ETV Bharat / city

రాష్ట్రంలో తెరుచుకోని థియేటర్లు.. కారణాలివే..

author img

By

Published : Oct 15, 2020, 11:23 AM IST

'పని ఉంటే మస్త్‌ర మామా.. లేదంటే పస్తులు మామా' అన్నారో సినీ కవి. ఈ గీతం ఇప్పుడు సినీపరిశ్రమకు అతికినట్లు సరిపోతుంది. లాక్​డౌన్ ప్రభావంతో చిత్రపరిశ్రమ చితికిపోయి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారితో రియల్​ లైఫ్​లోనే కాదు.. రీల్ లైఫ్​ను కష్టాలు చుట్టుముట్టాయి. సినిమా భాష‌లో చెప్పాలంటే.. ఫస్టాఫ్ చడీచప్పుడు లేకుండా చప్పగా విశ్రాంతి కార్డు వేసేసుకుంది చిత్రపరిశ్రమ. ఈ ఏడాది సెకండాఫ్ అయినా బాగుంటుందనుకుంటే ఆ ఆశా తీరేట్లు కనిపించడంలేదు. చిన్నబోయిన రంగుల తెర మళ్లీ కళకళలాడేలా థియేటర్లు తెరుచుకునేలా ప్రభుత్వం వెసులుబాటు ప్రభుత్వం కల్పించినా.. అందుకు ఎగ్జిబిటర్లు సుముఖంగా లేరు.

theatres not opened in ap state
రాష్ట్రంలో తెరుచుకోని థియేటర్లు.. కారణాలివే..

రాష్ట్రవ్యాప్తంగా సినిమా ఆడక థియేటర్లు మూతపడి దాదాపు 7 నెలలు కావస్తోంది. ఏపీలో 1,100 సినిమా హాళ్లు ఉండగా.. వీటిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. కరోనా మహమ్మారి.. వీరందరి జీవితాలను కుదేలు చేసింది. లాక్​డౌన్​తో థియేటర్లు తెరుచుకోక ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయా.. తమ జీవితం మళ్లీ ఎప్పుడు గాడిన పడుతుందా అని యజమానుల దగ్గర్నుంచి కిందిస్థాయి కార్మికుల వరకు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది. అయితే..

అవకాశమిచ్చినా.. తెరవలేం

అన్​లాక్-5లో భాగంగా ఈనెల 15నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. అయితే రాష్ట్రంలో ఎగ్జిబిటర్లు హాళ్లు తెరిచేందుకు సుముఖంగా లేరు. ఫిక్స్​డ్ విద్యుత్ ఛార్జీల రద్దు, ఇతర రాయితీలు కల్పించేవరకు థియేటర్లు తెరవలేమని వారు స్పష్టంచేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా హాలు నడవాలంటే సుమారు రూ. 10లక్షల వరకు పెట్టుబడి అవసరమని అంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం థియేటర్లు నడపాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని వాపోతున్నారు. ఈ నిబంధనల వల్ల ఒక్కో ప్రేక్షకుడిపై రూ. 25 అదనంగా భారం పడుతుందని చెప్పారు.

తెరిచినా.. సినిమాలేవి?

తెలుగు సినిమాల విడుదలలు ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. పండుగలకు అగ్ర హీరోల చిత్రాలు వస్తుంటాయి. ఆ తర్వాత వేసవి సీజన్ మొదలవుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలు సినిమా విడుదలకు గొప్ప సీజన్​గా భావిస్తుంటారు. అయితే మార్చిలోనే కరోనా విజృంభించటంతో.. వేసవి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. చిత్రీకరణలూ ఆగిపోయాయి. పూర్తయిన సినిమాలు ల్యాబుల్లో ఉన్నాయి. కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ వేదికలుగా ప్రేక్షకుల్ని పలకరించాయి. అన్ని ఖర్చులు భరించి థియేటర్లు తెరిచినా.. ఇప్పటికిప్పుడు విడుదలయ్యే సినిమాలు కనిపించడంలేదని ఎగ్జిబిటర్లు అంటున్నారు.

ఆ నిబంధనలతో కష్టమే

ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేస్తున్నారు. నిర్వహణ ఖర్చులు తడిచి మోపెడవుతాయని వాపోతున్నారు. ఇటీవల చిరంజీవి, నాగార్జున, ఇతర సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్​ను కలిసి సమస్యలను వివరించారు. అన్నింటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆ తర్వాత ఎగ్జిబిటర్లు అనేకమార్లు మంత్రి, అధికారుల చుట్టూ తిరిగినా దస్త్రం ముందుకు కదలటం లేదు. సినిమాహాళ్లను చిన్న పరిశ్రమగా గుర్తించాలని 1982లోనే ఉత్తర్వులున్నాయి. అది అమలు చేస్తే పరిశ్రమల మాదిరి యూనిట్ విద్యుత్ ధర 6 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు పదిన్నర రూపాయల వరకూ చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 1100 థియేటర్లలో 500 పైచిలుకు గత 5 నెలలుగా విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. మూసివేసిన వాటికి పన్ను చెల్లించవసరం లేదని చట్టం చెప్తున్నా అది అమలు కావట్లేదని వాపోతున్నారు.

అగ్నిమాపక నిబంధనలను 5 ఏళ్లకోసారి రెన్యూవల్ చేయటంతో పాటు ఇతర సమస్యలన్నీ పరిష్కరించి థియేటర్లు తెరవాలంటే మరో 2 నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లకు ఒప్పుకుంటే సంక్రాంతి నాటికి హాళ్లను అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు.

ఇవీ చదవండి..

ఒడ్డుకు వచ్చిన బంగ్లా నౌకను సముద్రంలోకి పంపడం ఎలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.