కోడిపందేల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలు ఉన్న కారణంగా... పోలీసులు అప్రమత్తమయ్యారు. కోడిపందేలు, కోడి కత్తి విక్రయాలపై టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఆత్కూరులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కోడికత్తి విక్రయాలపై నిఘా పెట్టారు.
వాటిని తయారు చేస్తూ ఇతర జిల్లాలకు రవాణా చేస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నిందితుడు జమలయ్యను అరెస్ట్ చేసి 700 కోడి కత్తులు స్వాధీనం చేస్తున్నారు. ఎవరైనా నిబంధనలు పాటించకుండా పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ రమణమూర్తితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చదవండి: