MLC Ananthababu bail petition: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను.. ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. కారు డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. ప్రస్తుతం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మే 19న జరిగిన తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. హత్య జరిగిన తర్వాత ప్రతిపక్షాలు, వివిధ వర్గాల నుంచి అనంతబాబును అరెస్టు చేయాలని పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చింది. అంతబాబును అరెస్టు చేసేంతవరకు సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం సైతం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసే క్రమంలో అనూహ్యంగా అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇవీ చూడండి:
Pawan Kalyan on Agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం: పవన్ కల్యాణ్