కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న ప్రభుత్వ వైద్యులు..సరైన పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేత వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం చేసేందుకు రక్షణ పరికరాలు అడిగిన వైద్యుడు సుధాకర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయటంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే... వైద్యుడిని బలి చేశారంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు సరైనవి కావన్న వర్ల... సస్పెన్షన్ ఎత్తివేయ్యాలని డిమాండ్ చేశారు. వైద్యులకు కావలసిన రక్షణ పరికరాలందించాలని కోరారు. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న వారి శ్రమను కించపరచవద్దని సూచించారు. వైద్యులకు సరైన ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధం చేయమనడాన్ని తప్పుబట్టారు.
ఇదీచదవండి