ETV Bharat / city

ఆంగ్లంపై బ్రిడ్జి కోర్సు... పాఠ్యాంశాలను సిద్ధం చేస్తున్న విద్యాశాఖ - విద్యార్థులకు ఆంగ్ల భాషపై బ్రిడ్జి కోర్సు

విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించేందుకు బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను సిద్ధం చేస్తోంది.

The Ministry of Education is preparing curriculum for students to conduct a bridge course on English language.
విద్యార్థులు ఆంగ్లం పై పట్టు సాధించేందుకు బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని ప్రభుత్వం యోచన
author img

By

Published : Feb 23, 2020, 12:04 PM IST

విద్యార్థులకు ఆంగ్ల భాషపై బ్రిడ్జి కోర్సు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను సిద్ధం చేస్తోంది. కోర్సును మార్చిలో ప్రారంభించి ఏప్రిల్ వరకు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. అవసరమైతే ప్రాథమిక స్థాయిలో నిర్వహించే పరీక్షల షెడ్యూల్​లోనూ మార్పులు చేయాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో 20 లక్షల వరకు విద్యార్థులున్నారు. వీరిని రెండు గ్రేడ్లుగా విభజించి... తరగతులు నిర్వహించనున్నారు. ఆంగ్లం మాట్లాడటం, అర్థం చేసుకోగలుగుతున్న వారిని ఒక బృందంగా ఏర్పాటు చేయనున్నారు. వీరికి 39 రోజులు బ్రిడ్జి కోర్సు నిర్వహించనున్నారు. రోజుకు 4గంటలు బోధిస్తారు.

ఆంగ్లంపై పట్టుకు సినిమాలు ప్రదర్శన

ఆంగ్లంపై పట్టు సాధించేందుకు ఆంగ్ల భాష సినిమాలు, ఇతర అంశాలను టీవీల ద్వారా ప్రదర్శించనున్నారు. ఇందుకు అంతర్జాలం, టీవీ ఇతర ఖర్చులకు ఒక్కో కేంద్రానికి రూ.5 వేల వరకు వ్యయమవుతుందని అంచనా. మరోవైపు ఒకటి నుంచి 6 తరగతుల వరకు ప్రతి సబ్జెక్టుకు ఒక వర్క్ బుక్ ఇవ్వనున్నారు. వీటిని పాఠశాలల్లోనే విద్యార్థులతో రాయించేలా రూపొందిస్తున్నారు. ఎలా బోధించాలి, ఎలాంటి మెలకువలు పాటించాలనేది వివరిస్తూ ఉపాధ్యాయులకు హ్యాండ్ బుక్ తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులు పాఠశాలల కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావడానికి మరో మార్గదర్శక పుస్తకాన్ని తీసుకొస్తున్నారు.

ఇవీ చదవండి...తరగతి గదులు లేక.. చెట్ల కిందే చదువులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.