.
'మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం శుభపరిణామం' - మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవటంపై స్పందించిన సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం శుభపరిణామమని.. హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్(High Court senior Advocate sunkara Rajendra Prasad) అన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో విచారణ ముగిసే అవకాశం ఉన్న సమయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం ప్రజావిజయమన్నారు. ప్రభుత్వ వాదనలో న్యాయం లేదని.. ఈ విషయం వారికి కూడా అర్థమైపోయిందన్నారు. అమరావతి రైతుల దీక్షలు, పాదయాత్ర కూడా ప్రభుత్వ నిర్ణయంలో కీలక పాత్ర పోషించాయంటున్న హైకోర్టు న్యాయవాది రాజేంద్రప్రసాద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం శుభపరిణామం'
.