విజయవాడ కమిషనరేట్ పరిధిలో దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడుల కేసులను దర్యాప్తు చేసేందుకు సీపీ బి.శ్రీనివాసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 9 మంది సభ్యులతో సిట్‌ను నియమించారు. వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృందం పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇప్పటివరకు సిటీ కమిషనరేట్ పరిధిలో హిందు దేవతా విగ్రహాలపై జరిగిన కేసులపై దర్యాప్తు చేయటంతో పాటు ...దేవాలయాల భద్రతను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇన్స్పెక్టర్, ఎస్సైలతో పాటు నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు. ఎస్బీ, సైబర్ క్రైమ్, సీసీఎస్, లా అండ్ ఆర్డర్, ఐటీ, క్రైమ్ విభాగాల సిబ్బందిని ప్రత్యేక బృందంలో నియమించారు.