సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందనివారికి ప్రయోజనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 18,47,996 మందికి.. రూ.703 కోట్ల నగదు అందించేందుకు నిర్ణయించింది. ఈ నగదును సీఎం జగన్ వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదు జమచేయనున్నారు. అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారికి.. ఏటా జూన్, డిసెంబర్ మాసాల్లో ఈ విధంగా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
డిసెంబర్ నుంచి మే నెల వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి.. లబ్ది పొందని వారికి జూన్ నెలలో లబ్ది చేకూర్చనున్నారు. జూన్ నుంచి నవంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాల్లో లబ్ది పొందని వారికి.. డిసెంబర్ లో లబ్దిచేకూర్చనున్నారు.
ఇదీ చదవండి:
CM Jagan Review On Omicron Variant: ఎలాంటి పరిస్థితులైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్