ETV Bharat / city

TG Venkatesh: బంజారాహిల్స్‌ స్థల వివాదంతో నాకెలాంటి సంబంధం లేదు: టీజీ వెంకటేశ్ - బంజారాహిల్స్‌లోని స్థల వివాదంపై స్పందించిన టీజీ వెంకటేశ్

TG Venkatesh: తెలంగాణ రాజధాని హైదరాబాద్​లోని బంజాహిల్స్‌లో కోట్ల విలువైన భూవివాదం కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే 58 మందిని పోలీసులు అరెస్టు చేయగా... మరికొందరు పరారీలో ఉన్నారు. అయితే కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న రాజ్యసభ్య సభ్యుడు టీజీ వెంకటేశ్.. ఈ వివాదంతో తనకెలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. మొదట ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని.. తర్వాత చేర్చారని వివరించారు.

TG Venkatesh reacts on telangana banjara hills land case
టీజీ వెంకటేశ్
author img

By

Published : Apr 20, 2022, 11:05 AM IST

Banjara hills Land Issue: హైదరాబాద్​ బంజారాహిల్స్​లో కోట్ల విలువైన ఈ భూవివాదం కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే 58 మందిని పోలీసులు అరెస్టు చేయగా... మరికొందరు పరారీలో ఉన్నారు. సర్వే నంబరు 403లో ఉన్న భూమి ప్రభుత్వానికి చెందిందేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనూహ్యంగా రిమాండ్ రిపోర్టులో ఏపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్​ పేరు ఉంటడంతో కేసు ఆసక్తికరంగా మారింది.

TG Venkatesh: హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని ఆస్తి వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్​ తెలిపారు. టీజీ విశ్వప్రసాద్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. మొదట ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని.. తర్వాత చేర్చారని వివరించారు. టీజీ విశ్వప్రసాద్ పేరు కూడా టీజీవీ అనే వస్తుందని గుర్తు చేశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఛైర్మెన్​గా ఉన్న తాను.. లక్షద్వీప్ టూర్​లో ఉన్నానని తెలిపారు.

బంజారాహిల్స్‌లోని స్థల వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు: టీజీ వెంకటేశ్

కావాలనే దుష్ప్రచారం: ఈ కేసు రిమాండ్ రిపోర్టులో రాజ్యసభ్య సభ్యుడు ఎంపీ టీజీ వెంకటేశ్‌ పేరును ఏ-5గా చేర్చారు. దీనిపై టీజీ వెంకటేశ్‌ సోదరుడు టీజీ రాఘవేంద్ర స్పందించి పశ్చిమ మండల డీసీపీకి లేఖ రాశారు. టీజీ విశ్వప్రసాద్‌కు సంబంధించిన భూవివాదంతో తన సోదరుడు టీజీ వెంకటేశ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలిసిన వారే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వప్రసాద్ తమకు దూరపు బంధువని.. అతడి ఇంటిపేరు కూడా టీజీ అని తెలిపారు. అంతేగానీ విశ్వప్రసాద్‌తో ఎలాంటి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు లేవని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరారు. వెంకటేశ్‌ ప్రమేయం ఉన్నట్లు వచ్చిన వార్తల్ని ఆయన కుమారుడు టీజీ భరత్ ఖండించారు.

సంబంధిత కథనం:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.