Tenth Class Exams New Schedule : పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ మారిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షల తేదీలను ముందుకు తీసుకొచ్చారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే నెల రెండో తేదీ నుంచి 13 వరకు నిర్వహించాల్సి ఉంది. అనంతరం మే 9నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నుంచి మే నెలకు రావడంతో మే నెలలో ప్రారంభించాల్సిన పది పరీక్షలను ఏప్రిల్‌కు తీసుకొచ్చారు. పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. ఈసారి ఏడు పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రం ఒక పేపర్‌గా.. జీవశాస్త్రం మరో పేపర్‌గా 50మార్కుల చొప్పున ఉంటాయి. మిగతా అన్ని సబ్జెక్టులు వంద మార్కులకు నిర్వహిస్తారు.
ఇదీ చదవండి : School Radio: పిల్లల్లో వినూత్న ఆలోచనలు ప్రోత్సహించేదే 'స్కూల్ రేడియా'