ETV Bharat / city

Corona in medical college: వైద్య కళాశాలలో 42 మందికి కరోనా..! - మెడికల్​ కాలేజీలో కరోనా కేసులు

Corona in medical college: తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా.. కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ వైద్య కళాశాలలో 42 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్​ పాజిటివ్​ నిర్ధారణ అయింది. పెరిగిన కేసులతో కళాశాలకు యాజమాన్యం సెలవులు ప్రకటించింది.

వైద్య కళాశాలలో 42 మందికి కరోనా
వైద్య కళాశాలలో 42 మందికి కరోనా
author img

By

Published : Dec 5, 2021, 8:06 PM IST

Corona in medical college: తెలంగాణలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లోని గురుకులాల విద్యార్థులకు, విదేశాల నుంచి వచ్చిన వారిలో పలువురికి కొవిడ్​ నిర్ధారణ కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా.. కరీంనగర్​ జిల్లాలోని ఓ ప్రైవేట్​ వైద్య కళాశాలలోనూ కరోనా కేసులు నమోదయ్యాయి.

మెడికల్ కళాశాలలో..
జిల్లాలోని ఓ ప్రైవేట్​ వైద్య కళాశాలలో 42 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్​ పాజిటివ్​ నిర్ధారణ అయింది. కొన్ని గంటల క్రితం 39 కేసులు నమోదు కాగా.. తాజాగా మరో ముగ్గురికి పాజటివ్​ అని తేలింది. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 42 కు చేరింది.

ఇటీవల కళాశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమం తర్వాత విద్యార్థుల్లో కరోనా లక్షణాలు బయటపడినట్లు సమాచారం. దీంతో.. విద్యార్థులకు కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్​ కేసులు నమోదు కావడంతో కళాశాలకు యాజమాన్యం సెలవులు ప్రకటించింది.

ఇదీ చదవండి: ఒకే పాఠశాలలో 60కిపైగా విద్యార్థులకు కరోనా.. లక్షణాలు లేకుండానే !

Tags: corona cases in ts , omicron cases , corona in gurukuls , ts corona cases latest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.