విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్దార్ధ కళాశాల వేదికగా నాలుగో తెలుగు మహాసభలు జరగనున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈనెల 27 నుంచి 3 రోజులపాటు జరగనున్న మహాసభల ద్వారా భాషాభిమానులు, సాహితీవేత్తలంతా ఒకే చోటుకు చేరనున్నారు. దీనికోసం కొమర్రాజు లక్ష్మణరావు సభాప్రాంగణం, గిడుగు రామ్మూర్తి సాహితీ సాంస్కృతిక వేదిక, సువరం ప్రతాపరెడ్డి భాషా పరిశోధన వేదికలను సిద్ధం చేస్తున్నారు. 2019ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన తరుణంలో... తెలుగు నేలపై మాతృభాష పరిరక్షణ, అభివృద్ధే లక్ష్యంగా... నాలుగో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు రూపకల్పన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు సంఘటితమై... భాషోద్యమాన్ని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నూతన విధానంపై చర్చ
ప్రపంచీకరణ కారణంగా తెలుగుతో పాటు పలు మాతృభాషల అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడిందని రచయితలు అభిప్రాయపడ్డారు. మహాసభల్లో తెలుగు వారి బాషా సంస్కృతులు, చరిత్ర, సాంకేతిక ప్రగతికి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించేలా నూతన విధాన నిర్ణయంపై చర్చిస్తామన్నారు. నేటి యువతకు తెలుగు భాషా ఔన్యత్యాన్ని చాటి చెప్పడం సహా పరిరక్షణకు తీర్మానాలు చేసి... దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
ఇదీ చదవండి: