ETV Bharat / city

తెలంగాణ: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - telangana 10th exams news'

తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కొవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్​ 8నుంచి పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధిని ఇస్తూ షెడ్యూల్​​ను విడుదల చేసింది.

tenth-exams-schedule-release
tenth-exams-schedule-release
author img

By

Published : May 22, 2020, 6:28 PM IST

కరోనా నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు అంగీకరించడంతో ప్రభుత్వం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. కొవిడ్ నిబంధనలకు లోబడి జూన్​ 8 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

పరీక్షా కేంద్రాల్లో భౌతికదూరం

విద్యార్థులు దూరం పాటించేలా... హైకోర్టు సూచనల మేరకు ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా... మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందుకు అనుగుణంగా... 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. గతంలో కేటాయించిన వాటికి సమీప దూరంలోనే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీటి వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా తెలియజేస్తామని వివరించారు.

విద్యార్థులకు మాస్కులు

పరీక్ష కేంద్రాలను రోజు శానిటైజ్ చేయడంతో పాటు విద్యార్థులకు మాస్కులు అందిస్తామని... థర్మల్ స్క్రీనింగ్ తర్వాతనే లోపలికి అనుమతిస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడుపుతుందని తెలిపారు. ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా... తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దగ్గు, జలుబు, జ్వరం ఉంటే...

పరీక్షలు రాసే విద్యార్థులుకు దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్షలు రాయిస్తామని తెలిపారు. ఇన్విజిలేటర్ అదే సమస్యలు కలిగి ఉంటే వారిని విధుల నుంచి తొలగిస్తామని తెలిపింది. పరీక్ష తేదీలు ఖరారైనందున విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వాలని... ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సూచించారు.

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇదీ చూడండి సుధాకర్​ తల్లిపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారు: జవహర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.