ETV Bharat / city

Orphans: 'బంధువుల వద్ద ఉండి చదవుకుంటాం'

కరోనా మహమ్మారి ఎందరో చిన్నారుల జీవితాలను అల్లకల్లోలంలోకి నెట్టింది. తల్లిదండ్రుల ఒడిలో సేదతీరాల్సిన వారిని అనాథలుగా మిగిల్చింది. వీరిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తున్నా.. సంరక్షణ హోంలో చేరడానికి పిల్లలు సిద్ధంగా లేరు. తమ బంధువుల వద్ద ఉండే చదువుకుంటామని చాలా మంది చిన్నారులు చెబుతున్నారు.

Orphans
Orphans
author img

By

Published : Jun 14, 2021, 10:48 AM IST

కొవిడ్‌ రెండో దశ ఎంతో మంది పిల్లల కన్నవారిని తీసుకెళ్లింది. వారి కలలను నిర్దాక్షిణ్యంగా తుంచేసింది. అనాథలుగా మిగిల్చి.. వారి భవిష్యత్​ను అయోమయంలోకి నెట్టేసింది. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచి ఆందుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.

140 మంది అనాథలు..

తెలంగాణలో సుమారు 140 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. వీరిలో ఏడాది వయస్సు నుంచి పదిహేనేళ్ల వారూ ఉన్నారు. వీరి సంరక్షణ కోసం హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలతో చిన్నపిల్లల హోంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైద్యులతో పాటు సిబ్బందినీ నియమించింది. ప్రతి జిల్లాలోనూ హోంలు ఏర్పాటు చేసింది.

ఆశ్రమాలకు రాము..

వారిలో ఒక్కరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనాథాశ్రమాలకు రావడానికి ఇష్టపడటం లేదు. ‘బంధువుల దగ్గరే ఉండి చదువుకోవడానికి వాళ్లు ఇష్టపడుతున్నారు. అందుకే వారికి ఇతరత్రా తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున రెండు నెలలకు సరిపడా రేషన్‌, ఇతర వస్తువులను పంపిణీ చేశారు. ప్రైవేటు సంస్థల సహకారంతో ప్రతి నెలా రూ.2 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

"గురుకుల పాఠశాలల్లో చేరతామంటే పూర్తిస్థాయిలో విద్య అందించేందుకూ ఏర్పాట్లు చేశాం. కొన్ని ప్రైవేటు పాఠశాలలు సైతం ఉచితంగా విద్య అందించేందుకు ముందుకు వస్తున్నాయని’’ ఓ అధికారి వెల్లడించారు.

ఇదీ చదవండి:

రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి బుగ్గనకు చేదు అనుభవం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.