వీటికి మినహాయింపులు
- హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు
- హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారు
- హైదరాబాద్ నగరంలో సరి బేసి విధానంలో దుకాణాలు తెరవాలి
- రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి (హైదరాబాద్ మినహా)
- అంతర్రాష్ట్ర బస్సులు అనుమతించట్లేదు
- బస్సుల శానిటైజేషన్ చేస్తారు, మాస్కులు తప్పనిసరి
- హైదరాబాద్‌లో ఆటోలు, కార్లు తిరగటానికి అనుమతి
- నిబంధనలకు మించి ఎక్కించుకుంటే కఠిన చర్యలు
- రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చు
- కంటైన్‌మెంట్ ప్రాంతంలో సెలూన్లు తెరుచుకోవచ్చు
- ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ పనిచేస్తాయి
- పరిశ్రమలు, ఫ్యాక్టరీలు అన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరి పనులు వాళ్లు చేసుకోవచ్చు
వీటికి మినహాయింపులు లేవు
- హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగవు
- కంటైన్‌మెంట్ ప్రాంతంలో పూర్తిగా దుకాణాలు బంద్
- అన్ని మతాల ప్రార్థనాలయాలు, ఉత్సవాలకు అనుమతి లేదు
- సినిమా షూటింగ్‌లకు అనుమతి లేదు
- మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవు
- సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదు
- అన్ని రకాల విద్యాసంస్థలు బంద్
- బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, క్రీడా స్టేడియాలు, జిమ్‌లు, పార్కులు బంద్