ETV Bharat / city

PRC: పీఆర్సీపై నేటి నుంచి ఉపాధ్యాయుల సంతకాల సేకరణ - నేటి నుంచి పీఆర్సీపై ఉపాధ్యాయుల సంతకాల సేకరణ

పీఆర్సీపై పునఃసమీక్షించాలని కోరుతూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టనున్నారు. ప్రభుత్వం స్పందించి మెరుగైన పీఆర్సీ అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.

నేటి నుంచి పీఆర్సీపై ఉపాధ్యాయుల సంతకాల సేకరణ

author img

By

Published : Feb 15, 2022, 8:49 AM IST

Updated : Feb 15, 2022, 9:02 AM IST

పీఆర్సీ ఐక్య వేదిక ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం సీఎం జగన్‌కు వినతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు కార్యాచరణ నోటీసు ఇచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌బాబు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం ప్రయత్నించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల వేదికతో ఫిట్‌మెంట్‌పై సీఎం చర్చించాలని వినతి ఇచ్చేందుకు సీఎం కార్యాలయానికి వెళ్లగా.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వినతి ఇవ్వాలని సీఎంవో సూచించింది. సజ్జల అందుబాటులో లేనందున మంగళవారం వినతిపత్రం ఇవ్వనున్నట్లు సుధీర్‌బాబు తెలిపారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అందుబాటులో లేనందున ఆయన్ని కలిసేందుకు సమయం ఇవ్వాలని అధికారులకు విన్నవించినట్లు పేర్కొన్నారు. మెరుగైన పీఆర్సీ కోసం ఐక్య వేదిక ఆధ్వర్యంలో మార్చి 8వరకు కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీపై పునఃసమీక్షించాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టనున్నారు.

ఇదీ చదవండి

CM REVIEW:రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స

Last Updated : Feb 15, 2022, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.