ETV Bharat / city

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వినూత్న నిరసనలు - విజయవాడ తాజా వార్తలు

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగు మహిళా విభాగం, తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో నాయకులు నిరసనను తెలిపారు. మచిలీపట్నంలో గ్యాస్ బండకు పాడే కట్టి శవయాత్ర నిర్వహించారు. టీఎన్​టీయూసీ ఆధ్వర్యంలో విజయవాడలో అర్ధ నగ్న ప్రదర్శన చేశారు.

protest over petrol and gas prices hike
వినూత్న నిరసనలు
author img

By

Published : Jul 26, 2021, 10:45 PM IST

గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్యాస్ బండకు పాడే కట్టి ప్రధాన రహదారిలో శవ యాత్ర నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెదేపా మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, తెలుగు మహిళ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు సెస్..

పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడలో అర్ధ నగ్న ప్రదర్శనతో వినూత్నంగా నిరసన తెలిపారు.నాడు ప్రతిపక్ష నేతగా ధరలపై బాదుడే బాదుడే అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచుకుంటూ పోతుంటే ఎందుకు స్పందించడం లేదని టీఎన్​టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు విమర్శించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు సెస్ రాష్ట్రంలో వసూలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. పన్నుల రూపంలో కార్మికులపై విపరీతమైన భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 లక్షల మంది వాహన మిత్ర పథకానికి అర్హులుగా ఉంటే కేవలం 2 లక్షల 50 వేలమందికే పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. తక్షణమే పెంచిన డీజిల్ ,పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఇంధన ధరల పెంపునకు నిరసనగా విజయవాడలో వామపక్షాల ధర్నా.. ఉద్రిక్తత

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఉత్సాహంగా ఆషాడ సారె

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.