ETV Bharat / city

DIVYA VANI: 'సీతానగరం కేసులో ఎమ్మెల్యే ఆళ్లను ప్రశ్నించాలి'

రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన సీతానగరంలో మహిళపై సామూహిక అత్యాచారం కేసులో 40 రోజులు గడిచినా పురోగతి లేకపోవడంపై తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి మండిపడ్డారు. ఈ కేసులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారించాలని ఆమె డిమాండ్​ చేశారు. నిందితులను కావాలనే కాపాడుతున్నారని ఆరోపించారు.

DIVYA VANI
సీతానగరం కేసులో ఎమ్మెల్యే ఆళ్లను.. డీజీపీ ప్రశ్నించాలి
author img

By

Published : Jul 17, 2021, 6:34 PM IST

రాష్ట్రంలో సంచలనం రేపిన సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని(ALLA RAMAKRISHNA REDDY) డీజీపీ విచారించాలని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి(DIVYA VANI) డిమాండ్ చేశారు. అత్యాచార నిందితులకు ఎమ్మెల్యే కొమ్ముకాస్తున్నారని ఆమె ఆరోపించారు. సంబంధం లేని విషయాల్లో తరచూ తలదూర్చే ఆర్కే తన నియోజకవర్గంలో జరిగిన అత్యాచార ఘటనపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.

ఈ ఘటనలో అధికారపార్టీ పాత్ర ఉంది కాబట్టే 40 రోజులు గడిచినా ముఖ్యమంత్రి ఇంతవరకూ బాధితురాలికి న్యాయం చేయలేదంటూ దివ్యవాణి ఆక్షేపించారు. డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని.. తమ వాళ్లను తప్పించేందుకు వివేకా హత్యకేసును తెదేపాపైకి నెట్టిన రీతిలోనే అత్యాచారం కేసుని మరుగునపడేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు చూపుతున్న శ్రద్ధలో సగమైనా మహిళల రక్షణపై పెట్టాలని సూచించారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని సొంత చెల్లి షర్మిల చెప్పినట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి కూడా సామాన్యుడిలా వ్యవహరిస్తూ.. ఆడబిడ్డలను రక్షించలేకపోతున్నారని అన్నారు.

కేసు వివరాలిలా..

గుంటూరు జిల్లా సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద యువతిపై సామూహిక అత్యాచారం జరిగి 40 రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకూ నిందితుల్ని పట్టుకోలేకపోయారు. ఈ దురాగతానికి పాల్పడిన వారెవరో నిర్ధారణకొచ్చినప్పటికీ వారిని ఇప్పటివరకూ అదుపులోకి తీసుకోలేకపోయారు.

అప్పటి నుంచి పరారీలోనే!

కాబోయే భర్తతో కలిసి కృష్ణా నది తీరానికి వెళ్లిన యువతిపై గత నెల 19 రాత్రి సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బాధితురాలు, ఆమెకు కాబోయే భర్త సెల్‌ఫోన్లను దోచుకుని వాటిని తాడేపల్లిలోని ఒకరికి విక్రయించారని తేలడంతో నిందితులెవరనేది ఓ నిర్ధారణకు వచ్చారు. ఆరు పోలీసు బృందాలు వారి కోసం వెతుకుతున్నా నిందితులు తప్పించుకు తిరుగుతుండటం గమనార్హం. ఘటన జరిగిన రెండు, మూడు రోజుల తర్వాత ఓ నిందితుడు కృష్ణా కెనాల్‌వద్ద స్నానం చేస్తుండగా.. మత్స్యకారులు గుర్తించి అతణ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నిందితుడు గూడ్సు రైలు ఎక్కి పరారయ్యాడు. పోలీసులు కృష్ణా కెనాల్‌ రైల్వేస్టేషన్‌వద్ద ఆగిన ఆ గూడ్సు రైలును తనిఖీ చేసినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఇప్పటివరకూ అతనితోపాటు మరో నిందితుణ్నీ పట్టుకోలేకపోయారు.

ఆ కోణంలో దృష్టి సారిస్తే?

నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరూ పరారై 40 రోజులు గడిచిపోయింది. వారి దగ్గర ఎంతో కొంత డబ్బులున్నా ఈ పాటికే ఖర్చయిపోయే అవకాశం ఉంది. మద్యం, గంజాయి అలవాటుండటంతో నిందితులు అవి లేకుండా ఉండలేరని వారి గురించి తెలిసినవారు చెబుతున్నారు. వీరు నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల్ని బ్లేడుతో బెదిరించి డబ్బులు లాక్కుని వాటితో మద్యం, గంజాయి కొంటుంటారు. నేరాలు చేసిన తర్వాత దట్టమైన పొదలు, పాడైపోయిన భవనాల్లో తలదాచుకుంటుంటారు. అలాంటి స్థావరాలు, మద్యం దుకాణాల వద్ద నిఘా పెట్టటం, వారికి ఇతర మార్గాల్లో డబ్బులు అందుతున్నాయా? అనే అంశాలపై దృష్టి సారిస్తే కొంత ఫలితం ఉంటుందని.. విశ్రాంత పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

'అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం'

హైకోర్టులో ఉద్యోగం పేరుతో వసూళ్లు.. మహిళ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.