ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ని కలిసిన ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేందుకు వ్యూహ రచన చేశారని తెదేపా అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. విగ్రహాల విధ్వంసం వెనక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం దాగి ఉందన్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు..సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో విగ్రహాలను ధ్వసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కుట్ర పన్నారన్నారు. ప్రభుత్వ అండ ఉన్నందునే పోలీసులు నేరస్థులపై శ్రద్ధ చూపడం లేదని సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఇదీచదవండి: సీఎం జగన్‌కు డీజీపీ నోటీసులు ఇవ్వాలి: వర్ల రామయ్య