అక్రమ మైనింగ్‌ను ప్రశ్నిస్తే దేవినేని ఉమాపై.. ఎస్సీ, ఎస్టీ కేసు పెడతారా అని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.ఎస్.రాజు నిలదీశారు. అక్రమ మైనింగ్ కు, దళితులకు సంబంధమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని డిప్యూటీ సీఎంకు ప్రొటోకాల్ మర్యాద కూడా అందడం లేదని.. అలాంటి ఉప ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి దళితులకు చేస్తున మోసం కనిపించడేం లేదా అని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిన జగన్మోహన్ రెడ్డే నిజమైన దళితద్రోహి అని దుయ్యబట్టారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లకు రూపాయి నిధులివ్వని ముఖ్యమంత్రే అసలైన దళిత ద్రోహి అన్నారు. ,ఎస్టీలకు రక్షణగా ఉండాల్సిన అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న సీఎంను ప్రశ్నించలేని వైకాపా దళిత నేతలే నిఖార్సైన దళిత ద్రోహులని మండిపడ్డారు.
తెలుగు యువత నిరసన
మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌కు నిరసనగా.. కృష్ణా జిల్లా మైలవరం తెదేపా కార్యాలయంలో తెలుగు యువత కార్యకర్తలు నిరసన చేపట్టారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, ఉమాను వెంటనే విడుదల చేయాలన్నారు.
ఇదీ చదవండి:
VIVEKA MURDER CASE: ఇద్దరు అనుమానితుల విచారణ.. కీలక సమాచారం రాబట్టిన సీబీఐ?