ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎంతలా నటించి.. చంద్రబాబు, బాలకృష్ణపై విమర్శలు చేసినా ఆయన పదవికి వైకాపాలో గ్యారంటీ ఉండదని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు అన్నారు. సీఎం జగన్.. తన మంత్రివర్గం నుంచి తొలగించేవారి జాబితాలో ఎస్సీలైన నారాయణ స్వామి, సుచరిత, ఆదిమూలపు సురేశ్, తానేటి వనిత ముందు వరుసలో ఉంటారని అన్నారు.
మానవత్వం లేని జగన్ వద్ద మంత్రులుగా పనిచేస్తున్నారని.. అందుకు ఎస్సీ నేతలు సిగ్గుపడాలని ఆయన మండిపడ్డారు. బాలకృష్ణను విమర్శించే స్థాయి నారాయణ స్వామికి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తండ్రి అధికారం అడ్డంపెట్టుకుని రూ. లక్ష కోట్లు అవినీతికి పాల్పడిన జగన్‌తో పోల్చితే బావ ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క ఛార్జ్‌షీట్ కూడా లేని బాలకృష్ణ నిజంగా అసమర్థుడేనని అన్నారు.
ఇదీ చూడండి:
ఆలయాలపై దాడుల పర్వం... 'సిట్'తో చెక్ పెట్టేందుకు సర్కార్ సన్నద్ధం