అండమాన్ నికోబార్ దీవుల్లో అమరావతికి మద్దతుగా తెదేపా ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. దేశంలో ఎక్కడాలేని మూడు రాజధానుల విధానం తీసుకొచ్చిన జగన్... ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని నేతలు విమర్శించారు. విశాఖలో దోచుకున్న భూముల కోసం అమరావతి రైతుల త్యాగాల్ని వంచించారని మండిపడ్డారు. రైతులకు కౌలు ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని ఆక్షేపించారు. తక్షణమే ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగించి..., రైతుల త్యాగాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అండమాన్ నికోబార్ తెదేపా పార్టీ అధ్యక్షులు మాణిక్యాలరావు, ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి