ETV Bharat / city

డీజీపీ ఆఫీసుకు వైకాపా రంగులు వేసుకోవాలి: నక్కా ఆనంద్ బాబు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా పోలిట్​ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.

నక్కా ఆనంద్ బాబు
నక్కా ఆనంద్ బాబు
author img

By

Published : Sep 19, 2021, 6:45 PM IST

వైకాపా సర్కార్​పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా? వ్యవస్దలు పనిచేస్తున్నాయా" అని ధ్వజమెత్తారు.గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటికి దాడి వెళ్ళి.. మళ్ళీ దానిని సమర్దించుకోవడం సిగ్గు మాలిన చర్య అని మండిపడ్డారు.

రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది. అసలు రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా..? వ్యవస్దలు పనిచేస్తున్నాయా..? డీజీపీ ఆఫీసుకు వైకాపా రంగులు వేసుకోవాలి.

-నక్కా ఆనంద్ బాబు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

పోలీసులు వైకాపా వాళ్ళ చర్యలను సమర్దించడం దుర్మార్గమన్నారు. "డీజీపీ ఆఫీసుకు వైసీపీ రంగులు వేసుకోవాలి"అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును వైకాపా ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. తెదేపా నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. జోగి రమేష్, ఆ రోజు దాడికి వచ్చిన వారిపై హత్య యత్నం కేసు నమోదు చేయాలన్నారు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు అని అధికారులు గుర్తు పెట్టూకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి: Devineni: చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడింది ఆ దుండగులే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.