ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బజారు మనుషుల్లా వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మానవత్వం మర్చిపోయి, బరితెగించి బూతులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రుల భాష, నడవడిక చూసిన సామాన్య పౌరులు ప్రజాస్వామ్యం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లిందనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని రేషన్ కార్డులున్నాయి, అందులో పింక్ కార్డులెన్ని..? ప్రతి నెలా ప్రజలకు ఎంత రేషన్ పంపిణీ అవుతుందో చెప్పగలరా అని మంత్రులను వర్ల రామయ్య ప్రశ్నించారు.
ఇదీ చదవండి: BJP Vishnu: 'రాయలసీమవి అక్రమ ప్రాజెక్టులైతే..తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులా ?'