ETV Bharat / city

రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు: పట్టాభి

author img

By

Published : Mar 21, 2021, 4:05 PM IST

ఇది వరకు లిక్కర్, సిమెంట్ వ్యాపారాలు ప్రారంభించిన సీఎం జగన్..కొత్తగా దివాలా తీసిన కంపెనీ ముసుగులో ఇసుక వ్యాపారానికి శ్రీకారం చుట్టారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. ఏడాదికి రూ. 3,500 కోట్ల వరకు నష్టాలను చవిచూస్తున్న జేపీ పవర్ వెంచర్స్ కంపెనీకి ఇసుక రీచ్​లను అప్పగించటంలో ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు

ముఖ్యమంత్రి జగన్...రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఇది వరకు లిక్కర్, సిమెంట్ వ్యాపారాలు ప్రారంభించిన సీఎం..కొత్తగా దివాలా తీసిన కంపెనీ ముసుగులో ఇసుక వ్యాపారానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఏడాదికి రూ. 3,500 కోట్ల వరకు నష్టాలను చవిచూస్తున్న జేపీ పవర్ వెంచర్స్ కంపెనీకి ఇసుక రీచ్​లను అప్పగించటంలో ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. జగన్ సన్నిహితుడైన అయోధ్యరామిరెడ్డి రామ్ కీ కంపెనీలో, గతంలో జగన్ కొనాలనుకున్న ఎథీనా పవర్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్​గా పనిచేసిన పెద్దిబొట్ల గంగాధరశాస్త్రే..జేపీ పవర్ వెంచర్స్​లోనూ డైరెక్టర్​గా పనిచేశారన్నారు. గంగాధర శాస్త్రిని అడ్డుపెట్టుకొని...జగన్ జేపీ వెంచర్స్​తో క్విడ్ ప్రోకో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించారు.

గతంలో టన్ను ఇసుక ధర రూ. 375 ఉంటే, ఇప్పుడు రూ. 450 కు పెంచారన్నారు. ప్రభుత్వం చెప్పిన ధరకు ఇసుక కొని, రవాణా ఛార్జీలు, జే ట్యాక్స్​లు కట్టి.... సామాన్యుడు ఇల్లు ఎలా కట్టుకుంటాడని నిలదీశారు. జేపీ వెంచర్స్ ముసుగులో జగన్​..వేల కోట్ల సొమ్ముని దిగమింగడానికి సిద్ధమయ్యారన్నారు.

ఇదీచదవండి

మితిమీరుతున్న అధికార పార్టీ నాయకుల అరాచకాలు: కొల్లు రవీంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.