పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, హక్కులపై పోరాటం తదితర అంశాలపై... ప్రధానంగా చర్చించనున్నారు. అంతకంటే ముందు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజాపరిస్థితులపై చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై...నియోజకవర్గాలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యచరణను ప్రకటించనున్నారు. ఇసుక కొరతపై తలపెట్టిన దీక్ష.., ప్రజాభిప్రాయాలపైనా నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీచదవండి