విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉక్కు కర్మాగార ఉద్యోగి రాసిన లేఖపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్లాంటు ఉద్యోగి శ్రీనివాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కలసికట్టుగా పోరాడి పరిశ్రమను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీలుగా పార్లమెంట్లో పోరాడుతామని స్పష్టం చేశారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పరిశ్రమ పరిరక్షణకు అంతా కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: