ETV Bharat / city

సీఎం దిల్లీ పర్యటనపై రహస్యమెందుకు? అందుకోసమే దిల్లీ వెళ్లారా ?: కనకమేడల - కనకమేడల లేటెస్ట్ న్యూస్

Kanakamedala on Jagan Delhi Tour: నిన్న దిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్.. కేంద్రాన్ని ఏం‎ అడిగారో చెప్పాలని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. జగన్ దిల్లీ పర్యటన గోప్యతపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

సీఎం దిల్లీ పర్యటనపై రహస్యమెందుకు?
సీఎం దిల్లీ పర్యటనపై రహస్యమెందుకు?
author img

By

Published : Jun 3, 2022, 8:02 PM IST

ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన గోప్యతపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెదేపా రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షాతో చర్చించిన అంశాలను ‎జగన్ ఎందుకు బహిర్గతం చేయటం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని అప్పులివ్వమని అడిగారా ? కేసుల మాఫీ గురించి అడిగారా ? వివేకా కేసులో సీబీఐ విచారణ నిలిపివేయమని కోరారా ? అసలెందుకు దిల్లీ పర్యటనకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 25 మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్.. తర్వాత మాట మార్చారని దుయ్యబట్టారు. కేంద్రంలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉన్నందున హోదాపై కేంద్రాన్ని ప్రాధేయపడటం తప్ప కమాడింగ్, డిమాండ్ చేయలేమని గతంలో చెప్పిన జగన్.. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకి తగిన బలం లేనందున తామే కీలకమని వ్యాఖ్యనిస్తున్నారని చెప్పారు. మరి ఈ అవకాశం వినియోగించుకుని కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తారా ? అని జగన్​ను నిలదీశారు.

కేంద్రం ద్వారా అప్పులు తెచ్చుకోవటం జగన్ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని.., ఇప్పటికే పరిమితికి మించి అప్పులు తెచ్చారని కనకమేడల మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ ఆర్థిక విధానాల్ని కాగ్ తప్పు పట్టినా..‎ జగన్ ఎందుకు లెక్కలు ‎బహిర్గతం చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన స్వార్డం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. జగన్ దిల్లీ పర్యటన రహస్యంగా ఉంచడానికి మీ కుటుంబ అంశం కాదని.., రాష్ట్రానికి సంబంధించిన అంశమని రవీంద్ర కుమార్ మండిపడ్డారు. కేంద్రాన్ని జగన్ రెడ్డి ఏం‎ అడిగారో ఆయన ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.