ETV Bharat / city

TDP Membership: రేపటి నుంచి తెదేపా సభ్యత్వ నమోదు.. ఇకపై వాట్సాప్​లోనూ - విజయవాడలో రేపటి నుంచే తెదేపా సభ్యత్వ నమోదు ప్రక్రియ

TDP Membership: ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెదేపా చేపట్టే సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ భవన్​లో సభ్యత్వ నమోదును చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

TDP Membership
రేపటి నుంచే తెదేపా సభ్యత్వ నమోదు ప్రక్రియ
author img

By

Published : Apr 20, 2022, 1:10 PM IST

TDP Membership: తెలుగుదేశం పార్టీ రెండేళ్లకు ఒకసారి చేపట్టే సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో సభ్యత్వ నమోదును చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఈసారి వినూత్నంగా వాట్సాప్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

నమోదు ఎలా చేసుకోవాలంటే..: ఇప్పటికే పార్టీలో సభ్యులుగా ఉన్నవారు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలన్నా, కొత్తగా సభ్యత్వం తీసుకోవాలన్నా, మీ ద్వారా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను పార్టీలో చేర్చాలన్నా అన్నీ వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు. దీనికోసం ఫోన్‌లో 9858175175 నెంబరును సేవ్ చేసుకుని వాట్సాప్ నుంచి ఈ నంబరుకు హాయ్ అని సందేశం పంపించడం ద్వారా నమోదు ప్రక్రియ మొదలవుతుంది.

సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల ప్రమాద బీమా అందిస్తారు. కుటుంబ ఆర్థిక కారణాల దృష్ట్యా కార్యకర్తల పిల్లల చదువులు ఆగిపోయినా... కార్యకర్త తీవ్ర అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో చికిత్స తీసుకోలేని స్థితిలో ఉన్నా.. అటువంటి వారికి పార్టీ అండగా నిలిచి ఆర్థిక సాయం అందిస్తుంది. వివాహాలకు, జీవనోపాధికి, పింఛన్లకు, సహజ మరణాల సందర్భంలోనూ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా నిలవనుంది.

ఇదీ చదవండి: Birthday wishes to CBN: చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.