ETV Bharat / city

'చంద్రబాబు సీఎం అవుతారన్న భయం జగన్‌లో మొదలైంది'

చంద్రబాబు తిరిగి సీఎం అవుతారన్న భయం జగన్‌లో మొదలైందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్​కు నిజంగా ప్రజాబలముంటే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. గుంటూరు - విజయవాడ నగరపాలక ఎన్నికలు వైకాపా పరమైతే.. రాజధాని తరలింపు ప్రక్రియను జగన్ మళ్లీ ప్రారంభిస్తారని తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా దుయ్యబట్టారు. పట్టణప్రాంత ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని పలువురు తెదేపా నేతలు కోరారు.

tdp leaders urge to think and vote in municipal elections

author img

By

Published : Mar 2, 2021, 3:11 PM IST

Updated : Mar 2, 2021, 4:42 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో పట్టణప్రాంత ప్రజలు ఆలోచించి అభ్యర్థులను ఎన్నుకోవాలని.. పలువురు తెదేపా నేతలు కోరారు.

ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేసింది. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తుంటే ఎందుకు భయపడుతోంది. పోలీసు వ్యవస్థను రాజకీయం కోసం అడ్డుపెట్టుకుంటున్న అధికార పార్టీ నేతలు నీచ సాంస్కృతిక విధానంలో వెళ్తున్నారు. - గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

  • చంద్రబాబు తిరిగి సీఎం అవుతారన్న భయం.. జగన్​లో మొదలైంది

చంద్రబాబు తిరిగి సీఎం అవుతారన్న భయం జగన్​లో మొదలైందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. "జగన్ కు నిజంగా ప్రజాబలముంటే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలి. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారనే నమ్మకం ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా మున్సిపల్ ఎన్నికలను అవకాశంగా మాలచుకోవాలి. దుష్టశక్తులపై పోరులో చంద్రబాబు వెనకడుగు వేయరనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి." అని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.

గుంటూరు - విజయవాడ వైకాపా పరమైతే రాజధాని తరలిపోతుంది

గుంటూరు - విజయవాడ నగరపాలక ఎన్నికలు వైకాపా పరమైతే రాజధాని తరలింపు ప్రక్రియను జగన్ మళ్లీ ప్రారంభిస్తారు. పురపాలక ఎన్నికల్లో పట్టణప్రాంత ఓటర్లు ఆలోచించి ఓటెయ్యాలి. రాష్ట్రంలో సాగుతున్న నిర్బంధ, అటవిక, రాక్షసపాలనకు పట్టణప్రాంత ఓటర్లే చరమగీతం పాడాలి. - తెదేపా నేత నాగుల్ మీరా

  • వారు ద్వితీయస్థాయి పౌరులుగా బతుకుతున్నారు

రాష్ట్రంలో ఎస్సీలు ద్వితీయస్థాయి పౌరులుగా బతుకుతున్నారని.. మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు."హత్రస్ సంఘటన దేశంలో ఉన్న వాస్తవ పరిస్తితులను తెలుపుతోంది. ఎస్సీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. వారి రక్షణకు బదులుగా భక్షించే వారికి భరోసా కల్పిస్తున్నారు. తిరుగుబాటు రాకముందే రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ కల్పించాలి." అని తెదేపా నేత జవహర్ విమర్శించారు.

ఇదీ చదవండి: రేషన్‌ వాహనాల రంగు మార్పుపై పిటిషన్.. డిస్పోజ్‌ చేసిన హైకోర్టు

Last Updated : Mar 2, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.