ETV Bharat / city

తెదేపా కార్యకర్త అరెస్ట్​పై నేతల ఆగ్రహం..

TDP LEADERS PROTEST: యూట్యూబ్ నిర్వాహకుడు వెంకటేశ్‌ అరెస్టుపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐడీ సీఐ జగదీశ్‌ దురుసుగా ప్రవర్తించారని.. సీఐ సహా పలువురిపై ప్రైవేటు కేసు వేయాలని తెదేపా నిర్ణయించింది. గతంలోనూ సీఐ జగదీష్ పలు మార్లు వివాదాస్పదంగా వ్యవహరించారని ఆరోపించింది.

TDP LEADERS PROTEST
యూట్యూబ్ నిర్వాహకుడు వెంకటేశ్‌ అరెస్టుపై తెదేపా నేతల ఆగ్రహం
author img

By

Published : Jun 30, 2022, 4:24 PM IST

TDP LEADERS PROTEST: పల్నాడు జిల్లాలో యూట్యూబ్ నిర్వాహకుడు వెంకటేశ్‌ అరెస్టుపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. గుంటూరులో తెలుగుదేశం శ్రేణులు సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

  • అమరావతి మండలం, ధరణికోటకు చెందిన వెంకటేశ్ అనే ఒక సామాన్య యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడిని, మరో వ్యక్తి సాంబశివరావును పోలీసులు అర్థరాత్రి ఇంటిపై పడి అరెస్టు చెయ్యడం దారుణం. ప్రభుత్వ అసమర్థపాలనపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అరెస్టుచేస్తారా? వాళ్లేమన్నా ఖునీకోరులా? తీవ్రవాదులా?(2/4)

    — N Chandrababu Naidu (@ncbn) June 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చంద్రబాబు ఆగ్రహం: అసమర్థ పాలనపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అరెస్టు చేయడం ఏంటని.. చంద్రబాబు ప్రశ్నించారు. అర్ధరాత్రి గోడలు దూకి మనుషులను ఎత్తుకెళ్లడం ఏంటని నిలదీశారు. దోపిడీ దొంగల సంస్కృతిలోకి పోలీసులు వెళ్లడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదని.. అరెస్టు సమయంలో పోలీసులు లైట్లు పగులగొట్టి చీకట్లో చేసిన విధ్వంసమే నిజమైన నేరమని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ పెద్దల మన్నన కోసం బరితెగిస్తున్న పోలీసు అధికారులు తప్పక మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన వెంకటేశ్, సాంబశివరావులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

యూట్యూబ్ నిర్వాహకుడు వెంకటేశ్‌ అరెస్టుపై తెదేపా నేతల ఆగ్రహం

వెంకటేష్​ అరెస్ట్​పై తెదేపా నేతల నిరసన..
యూట్యూబ్ నిర్వాహకుడు వెంకటేశ్‌, సహ నిర్వహకుడు సాంబశివరావును అర్ధరాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే వెంకటేష్​ అరెస్ట్​పై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. తలుపులు విరగ్గొట్టి, లైట్లు పగలగొట్టి విధ్వంసం సృష్టిస్తారా? అని మండిపడ్డారు.

గుంటూరు: జిల్లాలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. యూట్యూబర్లు వెంకటేశ్‌, సాంబశివరావు అరెస్టుపై ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.