స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేయడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెంపపెట్టులాంటిదని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో 'ప్రజాస్వామ్యం-స్థానిక సంస్థల ఎన్నికలు' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్, జనసేన, సీపీఎం, ప్రజాసంఘాలు, న్యాయవాది సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలో కోడ్ ఎక్కడా కనిపించలేదని...వైకాపా నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అటు కరోనాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
'వైకాపా అరాచకాలకు పాల్పడింది... ఎన్నికలు రీషెడ్యూల్ చేయండి' - వర్ల రామయ్య తాజా ప్రెస్ మీట్
స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీం తీర్పును తెదేపా నేతలు స్వాగతించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో వైకాపా నేతలు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేయడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెంపపెట్టులాంటిదని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో 'ప్రజాస్వామ్యం-స్థానిక సంస్థల ఎన్నికలు' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్, జనసేన, సీపీఎం, ప్రజాసంఘాలు, న్యాయవాది సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలో కోడ్ ఎక్కడా కనిపించలేదని...వైకాపా నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అటు కరోనాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి-సుప్రీం తీర్పుపై కమలనాథుల హర్షం..