ETV Bharat / city

TDP Leaders on Ashok Gajapatiraju Issue : మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలి - తెదేపా - అశోక్ గజపతి రాజు ఘటనపై కిమిడి నాగార్జున విమర్శలు

TDP Leaders on Ashok Gajapatiraju Issue : రామతీర్థంలో జరిగిన సంఘటనను తెదేపా నేతలు ఖండించారు. ఆ చర్య అశోక్ గజపతిరాజును అవమానించడమే అని ఆరోపించారు. ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైకాపా తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

TDP Leaders on Ashok Gajapatiraju Issue
మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలి -తెదేపా నాయకులు
author img

By

Published : Dec 22, 2021, 4:36 PM IST

TDP Leaders on Ashok Gajapatiraju Issue : రామతీర్థంలో జరిగిన సంఘటనను తెదేపా నేతలు ఖండించారు. ఆ చర్య అశోక్ గజపతిరాజును అవమానించడమే అని ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలి -అచ్చెన్నాయుడు
ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైకాపా తిలోదకాలు ఇచ్చిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రామతీర్థంలో అశోక్ గజపతిరాజును అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శంకుస్థాపనపై ధర్మకర్తల మండలితో చర్చించకపోవడం జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. శంకుస్థాపన శిలాఫలకంపై ఆలయ అనువంశిక ధర్మకర్త పేరు లేకపోవడం సంస్కృతి, సంప్రదాయాలను కాలరాయడమేన్నారు. ఈ విషయంలో మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజలే వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు -కిమిడి నాగార్జున
జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అశోక్ గజపతిరాజే లక్ష్యంగా వేధింపులు మొదలయ్యాయని విజయనగరం పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు కిమిడి నాగార్జున ఆరోపించారు. మంత్రి బొత్స జిల్లాలోని సమస్యలు పట్టించుకోకుండా, అశోక్ గజపతిరాజుని అవమానించి వికృతానందం పొందుతున్నారన్నారు. విజయసాయిరెడ్డి మార్గదర్శకత్వంలోనే, మంత్రి బొత్స, రామతీర్థం ఆలయప్రాంగణంలో అశోక్ గజపతిరాజుని అవమానించారని ఆక్షేపించారు. అశోక్ గజపతిరాజుని అవమానించడంతోపాటు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన మంత్రులను తక్షణమే ప్రభుత్వంనుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌చేశారు. అశోక్ గజపతిరాజుని వేధిస్తున్న ముఖ్యమంత్రికి, వైకాపా ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చెప్పాల్సినవిధంగా బుద్ధిచెబుతారని కిమిడి నాగార్జున అన్నారు.

ఈ ఘటనపై సీఎం వెంటనే సమీక్ష జరపాలి -మంతెన సత్యనారాయణ
రామతీర్ధంలో ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుపై మంత్రుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ చెప్పారు. విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే అశోక్ గజపతి రాజుపై, ఆయన కుటుంబంపై దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. సీఎం వెంటనే అశోక్ గజపతిరాజుకి జరిగిన ఘటనపై సమీక్ష జరపాలని డిమాండ్‌చేశారు. 48 గంటల్లో సీఎం ఈ ఘటనపై స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మంతెన సత్యనారాయణరాజు హెచ్చరించారు.

ఇదీ చదవండి : Ashok Fires On Govt: రామతీర్థం బోడికొండపై ఉద్రిక్తత.. రామాలయ శంకుస్థాపనలో తోపులాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.