రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెదేపా నేత అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 5న విజయవాడలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహణ ఏర్పాట్లను ఆ పార్టీ ముఖ్యనేతలు విజయవాడ కేశినేని భవన్‌లో భేటీ అయ్యి చర్చించారు. వైకాపా మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను సమావేశానికి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
ఇవీ చూడండి-'ఆంగ్ల మాధ్యమంలో చదివిన వ్యక్తులు జైలుకు ఎందుకు వెళ్లారు..?'