ETV Bharat / city

ప్రభుత్వ తీరుపై తెదేపా ధ్వజం - సీఎం జగన్​పై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం

ముఖ్యమంత్రి జగన్.. 16 నెలల్లో రూ.26కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని.. తెదేపా నేతలు ఆరోపణలు చేశారు. ప్రత్యేక‌ హోదా సాధన పేరుతో తన కేసుల మాఫీ కోసం దిల్లీ వెళ్లేందుకూ ప్రత్యేక విమానాలు వినియోగించారని విమర్శించారు. దేవాలయాల్లో దాడుల విషయంలో పోలీసులు నిందితులను పట్టుకోకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.

tdp leaders fires on cm jagan
ప్రభుత్వ తీరుపై తెదేపా ధ్వజం
author img

By

Published : Feb 5, 2021, 5:16 PM IST

"హెలికాఫ్టర్లు, ప్రైవేటు జెట్లలో తిరిగేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి.. 16నెలల్లో రూ.26కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. చీకట్లో దిల్లీ వెళ్లి జైలుకు పోకుండా వేడుకోలు, జడ్జీల మీద ఫిర్యాదులు, కోర్టు ముందు హాజరు, పెళ్లిళ్లు, పేరంటాల కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టారు తప్ప ప్రజల కోసం ఏం చేశారు" అని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.

కనీసం రూ.26పెట్టుబడులు కూడా తీసుకురాలేదు: జవహర్

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ బిల్లులకు రూ.26కోట్లు ఖర్చుపెట్టారని.. రాష్ట్రానికి కనీసం కనీసం 26రూపాయల పెట్టుబడులు కూడా తీసుకురాలేదని మాజీమంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతికి, వివేకానందరెడ్డి వర్థంతికి, ఫ్యాక్షనిస్టు చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం హెలికాఫ్టర్ వాడారని తెలిపారు. ప్రత్యేక‌ హోదా సాధన పేరుతో తన కేసుల మాఫీ కోసం దిల్లీ వెళ్లేందుకూ ప్రత్యేక విమానాలు వినియోగించారని విమర్శించారు. హెలికాఫ్టర్ పర్యటనలకే రూ.26కోట్లు జనం సొమ్ము కాజేశారంటే, వచ్చే 3ఏళ్లలో వివాహాలు, విందులు, చావులు, ప‌రామ‌ర్శల‌కు హెలికాఫ్టర్ లో తిర‌గ‌డానికి వందల కోట్లు కొట్టేస్తారని ట్విట్టర్​లో దుయ్యబట్టారు.

దేవాలయాలపై దాడులు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్న ప్రభుత్వం.. అక్కడ మనుషులు కనిపించే కెమెరాలనే పెట్టిందా అని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఎద్దేవా చేశారు.

"ఆలయ దాడుల దోషులను పట్టుకోవాలంటే పోలీసులకు గంట కూడా సమయం పట్టదు. అధికారపార్టీ నేతల అండతోనే ఈ దాడులు జరుగుతున్నాయి కాబట్టి వారిని రక్షించేందుకు విచారణ పేరుతో.. పోలీసులు కాలయాపన చేస్తున్నారు. రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉంటే..మంత్రి వెల్లంపల్లికి కాస్తైనా గౌరవం ఉండేది. ఆలయాలు ధ్వంసం చేసింది తానే అని ప్రకటించిన ప్రవీణ్ చక్రవర్తిపై.. విచారణ ఎంత వరకూ వచ్చిందో డీజీపీ ఎందుకు వెల్లడించట్లేదు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామన్నారు. సీబీఐ విచారణ కోరుతూ రాసిన లేఖను బయటపెట్టాలి. 161దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్క నిందితుడ్నీ పట్టుకోలేదు. ప్రతి ఘటనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. దాడులన్నింటిపై కేంద్ర హోం శాఖ సీబీఐ విచారణ జరపించాలి" -తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు

ఇదీ చదవండి:

అపహరణకు గురైన సామకోటవారిపల్లి సర్పంచి అభ్యర్థి క్షేమం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.