Somireddy fired on Jagan: దేశంలో అంటరాని పార్టీ ఏదైనా ఉందంటే అది వైకాపానేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తాము ఎవరితో కలిస్తే జగన్ కి వచ్చిన నష్టమేంటని ఆయన నిలదీశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరితో కలిసారో జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. జగన్ చెప్పే అబద్ధాలు ప్రజలు విశ్వసించరని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరికీ దుష్టచతుష్టయం ఎవరో తెలుసని అన్నారు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి చూసి ప్రజలు భయపడుతున్నారన్నారు. వైకాపా పాలన మూడేళ్లలో ఏం ఒరగపెట్టారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.
ఇవీ చదవండి :